ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరి పారదర్శకంగా జరగాలి: మానే రామకృష్ణ

  


భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో అధికారులు పారదర్శకత పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భద్రాచలం బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మానే రామకృష్ణ గారు ఒక ప్రకటన తెలియజేశారు. 

స్థానిక ఎమ్మెల్యే అతని అనుచరులు నియోజకవర్గంలో అన్ని మండలాలలో తమ స్వార్ధ ప్రయోజనాల కోసం లిస్టు తయారుచేసి ఆ లిస్టులే అధికారులు ఆమోదించాలని అధికారులపై ఒత్తిడి తీసికొస్తూ అధికారులని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని అన్నారు.

 L1, L2, L3, అనే తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మానే రామకృష్ణ డిమాండ్ చేశారు.

 ఇట్టి విషయంలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో పర్యవేక్షిస్తామని ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డా ఎంతటి వారినైనా ఉపేక్షించే పనిలేదని అధికారులు ఈ విషయంలో తగు జాగ్రత్త వహించాలని లేనియెడల ఎస్సీ, ఎస్టీ కమిషన్ మరియు న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని మరల రీయంక్వైరీ చేయిస్తామని అట్టి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఉపేక్షించబోమని హెచ్చరించారు.


మొన్న జరిగిన గృహ నిర్మాణ శాఖామంత్రి గారి భద్రాచల నియోజకవర్గ పర్యటనలు ప్రతి మండలంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవ్వడమే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో ఎంత అవినీతి జరిగిందో దీనికి నిదర్శనం అని అన్నారు అట్టి విషయంలో మరలా సర్వే చేసి నిరుపేదలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని భద్రాచలం నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జ్ మానే రామకృష్ణ గారు డిమాండ్ చేశారు.

Post a Comment

أحدث أقدم