అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించండి

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఎంపిక ప్రక్రియలో అసలైన అర్హులను అన్యాయం


ప్రహాసనంగా లబ్ధిదారుల ఎంపిక 


ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు


ఇందిరమ్మ ఇండ్లకు పారదర్శకంగా ఎంపిక చేయాలి..


సామాజిక కార్యకర్త, న్యాయవాది

కర్నె రవి




మణుగూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంపికలో పినపాక నియోజకవర్గంలో నిరాశ్రయులు , ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, పేదలకు భద్రమైన గృహాలను 

ఇందిరమ్మ పథకంలో అంది

స్తామని పాలకులు చెప్పిన మాటలు హామీలకే పరిమితమ

య్యాయని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి

ఆరోపించారు. సోమవారం ఆయన పట్టణంలోని ఆయన 

కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.గత గోదావరి వరదల సమయంలో ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారికి సైతం ఇందిరమ్మ ఇల్లు దక్కలేదన్నారు. అలాగే మల్లెల మడుగు గ్రామంలో నిరుపేద కుటుంబంతో ఇద్దరు దివ్యాంగు

లతో పూరి గుడిసెలో నివసిస్తున్న కుటుంబాన్ని కూడా అధికారు

లు గుర్తించకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని, పథకం ఎంపికలో అధికారుల పనితీరుకు ఈ ఘటన

నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

అనేక గ్రామాలలో డబ్బున్న వాళ్లకు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించడం జరిగిందని, ఇది సరికాదన్నారు. ఇటీవల విడుదలైన లబ్ధిదారుల జాబితాలో పంచాయతీ కమిటీ సభ్యుల కుటుంబసభ్యులు వంటి అర్హత లేని వ్యక్తులు ఎంపికై ఉండటంతో అసలైన నిరుపేదలకు గృహ కల నెరవేరకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాప్రతినిధులు , కమిటీ సభ్యులు ప్రత్యక్ష ప్రమేయంతో లబ్ధిదారుల ఎంపికను వక్రీకరించా

రని, పారదర్శకత లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. ఎంపిక ప్రక్రియలో అసలైన అర్హులను నిర్లక్ష్యం చేయడం వల్ల, నిజమైన నిరు

పేదలకు తీవ్ర నష్టం జరిగింద

న్నారు. అసలైన నిరుపేదలకు గృహాలు కల్పించడంలో రాజకీయ

జోక్యం తగదన్నారు.మరో పక్క వాస్తవ సర్వే ఆధారంగా లబ్ధిదా

రుల ఎంపిక జరగాలని ముఖ్య

మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినా, నియోజక వర్గంలో అధికారుల పనితీరుతో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందన్నారు. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయకుం

డా అనర్హులకు, ఆర్థికంగా ఉన్న వారికి ఎలా ఇళ్లను కేటాయిస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీలు ఉన్నా నిరుపేదలకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు కోసం ఎదురుచూస్తున్నా అధికారులు, కనికరం చూపడం లేదని మండిపడ్డారు.అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వ నిబందనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వారికి ఇష్టం వచ్చిన రితీన అనర్హులకు అంటగడు

తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారు, ట్రాక్టర్, ఎక్కువ భూమి, గతంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన తదితర వారికి ఇండ్లు మంజూరు చేసారని, నిజమైన అర్హులకు ఇండ్లు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులను ఇండ్లు కావాలని ప్రజలు అడిగితే అధికార పార్టీ నాయకులు ఎవరు చెప్పితే వారి పేర్లు మాత్రమే వస్తాయని, మా చేతిలో ఏమి లేదని వారు ఘంటాపథంగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పేద ప్రజలను గాలికి వదిలేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యను పట్టించుకోని అసలైన పేదలు, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఫై జిల్లా కలెక్టర్ రి-వెరిఫికేషన్ చేసి నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లోని నిజమైన అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి అధికారం

లోకి వచ్చిందని, వాటిని తక్షణమే అమలు చేయాలని రవి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ పథకాన్ని సమర్థవం

తంగా నియోజకవర్గంలో అమలు చేయాలని, తొలి, మలి దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

లో అత్యంత పేదవారికే ఈ ఇళ్లను కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత ఉండాలని, అర్హులకే అవకాశం కల్పించాలని, నిరుపేదలకు న్యాయం జరగాలని ఆయన కోరారు.

1 تعليقات

  1. పినపాక మండలం లో ఏడూర్ల బయ్యారం లో విలేకర్స్ పార్టీ నాయకులు చెప్పి నట్టు ఇల్లు వుండి కొన్ని రోజులు అద్దెకు ఉంటే ఇళ్లులుమంజూరు చేయటానికి ప్రయత్నం చేస్తున్న్నరు సొంతఇల్లు వొదిలి అద్దెకు ఉంటున్నారు దయచేసి నిరుపేదలకు దక్కెట్టు చేయండి సీఎం సార్ జై కాంగ్రెస్ జై కిసాన్ జై జవాన్

    ردحذف

إرسال تعليق

أحدث أقدم