బూర్గంపాడు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రం లో తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బూర్గంపాడు మండలానికి చెందిన *105* మందికి * *1కోటి 5 లక్షల12వేల 180 రూపాయల* విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన *పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు* వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ… సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు, బూర్గంపాడు మండలానికి కోట్ల నిధులు సమకూర్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, పేద ప్రజల శ్రేయస్సు కొరకే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, సన్న బియ్యం, సన్న ధాన్యం పంటకు 500 బోనస్, ఇలా అనేక పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు,అదేవిధంగా వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకొని తీవ్ర ఎండలకు బయట తిరగొద్దని ఆయన కోరారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో అగ్రికల్చర్ ADA తాతారావు గారు, బూర్గంపాడు ఎమ్మార్వో ముజాహిద్ గారు,ఎంపీడీఓ , జమలరెడ్డి గారు,బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు, యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు
إرسال تعليق