ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
యువకుల జీవితాలు మారుతాయి, బ్యాంకర్లకు మంచి పేరు వస్తుంది
జిల్లాస్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి
రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశంలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకులతో ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం ఒక సాధారణ సంక్షేమ పథకం గా చూడవద్దని బ్యాంకర్లను కోరారు. మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి పథకానికి రూపకల్పన చేసినట్టు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలకు ఏనాడు ఏ ప్రభుత్వం కేటాయింపులు చేయలేదని తెలిపారు. కొలువుల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలపాటు నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగ
إرسال تعليق