దాతలు ఆదుకోండి.. అధికారులు స్పందించండి

 


-- ఇళ్ళు లేదు... పెన్షన్ లేదు 

-- పూట గడిచే పరిస్థితి లేదు 

-- అద్దె ఇంట్లో జీవనం 

-- తండ్రి కొడుకు దివ్యాంగుల ఆవేదన 


పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కులపగిరి రాజేష్ తన ఎడమ కాలును కోల్పోయాడు. డాక్టర్లు 85% గా సదరం సర్టిఫికెట్ మంజూరు చేశారు. తన కొడుకు హిమకేష్ (7yrs- మరుగుజ్జు) కు శారీరక ఎదుగుదల లేదని నిర్ధారించిన డాక్టర్లు 50% సదరం సర్టిఫికెట్ మంజూరు చేశారు. రాజేష్ తన ఎడమకాలను కోల్పోవడంతో కుటుంబంలో వారు దిక్కుతోచని స్థితిలో సతమతం అవుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ బండిని అందించాలని, సీతారాంపురంలో తనకు గల ఖాళీ స్థలంలో *ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, తనకు తన కొడుకుకి పెన్షన్ మంజూరు  చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం వారి భార్య దేవకి, కూతురు కాషిణి జై, కొడుకు హిమకేష్ తో కలిసి బయ్యారంలో అద్దెఇంట్లో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి అధ్యక్షులు మహమ్మద్ బసిరుద్దీన్   వారి కుటుంబ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, వారికి 25 కిలోల బియ్యం కొంత నగదును సహాయంగా అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాతలు ఎవరైనా ఉంటే వారి కుటుంబానికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

Post a Comment

أحدث أقدم