పంచాయతీ పోరుకు సిద్ధం..!!*

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



-వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు 

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడిన ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పోలింగ్‌కేంద్రాల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 13వరకు పోలింగ్‌కేంద్రాలపై అభ్యంతరాలను తెలియజేయాలని అధికారులు సూచించగా, ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 


గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గత జనవరి 30తో ముగిసింది. ఫిబ్రవరి1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. మొదట ఆరునెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని ప్రకటించినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవటంతో మరో ఆరునెలలుగా పొడిగించారు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలై పదినెలలు దాటింది. ఎన్నికల నిర్వహణకు ఈనెలలో షెడ్యూల్‌ వెలువడితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం 


ఆశావహుల ఎదురుచూపు..


పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండగా, నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తోందా అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈనెల చివరి వారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందని, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ప్రధానపార్టీలకు చెందిన నాయకులు, సర్పంచ్‌ పదవుల్లో బరిలో ఉండేందుకు కసరత్తులు చేపడుతున్నారు. గతంలో చాలా పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగగా, ఈసారి అంతసులువు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరాలను ప్రకటించినా ఏకగ్రీవ ఎన్నిక జరిగిన పంచాయతీలకు ఎలాంటి నజరానాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఇదిలా ఉండగా, గతంలో ఇద్దరు సంతానం కంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులుగా ఉండటం, ఈ సారి ఆ నిబంధన ఎత్తివేయటంతో గ్రామాల్లో ఆశావాహులు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల్లో ఎలాగైనా నిలబడి ఎంతైనా ఖర్చు చేసి విజయం సాధించాలన్న పట్టుదలతో చాలామంది ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

Post a Comment

أحدث أقدم