పినపాకలో కలకలం – బీరు బాటిల్‌లో పురుగులు గుర్తింపు

G Rajashekar
By -
0

 


EB NEWS/పినపాక:


పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఉన్న అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి అక్కడ బీరు కొనుగోలు చేసి తాగుతుండగా, బాటిల్ లోపల పురుగులు కనిపించడం కలకలం రేపింది.


బీరు తాగుతున్న సమయంలోనే బాటిల్‌లో పురుగులు గుర్తించిన బాధితుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తాను గమనించకుండా ఆ మద్యాన్ని తాగితే ప్రాణాలకు ప్రమాదం జరిగేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఈ ఘటనపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాణ్యతలేని మద్యం ఎలా విక్రయానికి వస్తుందో, ఆ బీర్లు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తి వివరాలు బయటపడాల్సి ఉందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)