రాష్ట్ర స్థాయి క్రీడల్లో దుర్గ భవాని ప్రశంస పత్రం అందజేసిన కలెక్టర్ జితేష్ వి. పాటేల్
EB NEWS/అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలోని జగ్గారం గ్రామ నివాసి దుర్గ భవాని రాష్ట్ర స్థాయి లెమన్ అండ్ స్పూన్ క్రీడాల్లో రాణించినందుకు ఐ.టి.డీ.ఏ భద్రాచలం వేదికగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటేల్ ప్రశంచించి సన్మానం చేశారు.అనంతరం సర్టిఫికెట్ అందజేసిన అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మంచి స్థాయికి చేరి ఎందరికో ఆదర్శం కావాలని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సున్నం తిరుపతమ్మ, ఉప సర్పంచ్ లకేల రమేష్, ఊకె సాయి దుర్గ భావానికి అభినందనలు తెలిపారు. భవిత స్కూల్ యందు చదువుకుంటూ లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండవ స్థానంలో నిలిచినందుకు గర్వాంగా ఉందని కొనియాడారు. ఆమెకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
ఈ కార్యక్రమంలో ఊకె సాయి కుమార్, కోటి, సాగర్, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి