భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించనున్న మినీ మేడారం (సమ్మక్క–సారలమ్మ జాతర) ఏర్పాట్లను స్థానిక ఎంఎల్‌ఏ పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు.
అమ్మవారు వన ప్రాంతం నుంచి గ్రామానికి వచ్చే పవిత్ర మార్గాన్ని ఎంఎల్‌ఏ అడవి మార్గంలోనే పర్యటిస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా దారిలోని వసతులు, రహదారి పరిస్థితులు, భక్తుల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ అధికారులు, తోగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గుడి ప్రాంగణంలో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టమైన సూచనలు చేశారు. ఈ పవిత్ర జాతరను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంఎల్‌ఏ పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి