సింగారం పంచాయతీలో తాగునీటి ఇక్కట్లు



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


గుక్కెడు నీటికోసం సాయి నగర్ వాసుల విలవిల


వారంరోజులుగా నిలిచిపోయిన మిషన్ భగీరథ నీటి సరఫరా 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరిసిన పంచాయతీ అధికారులు


ప్రత్యేకాధికారి రారు.. పట్టించుకోరు


తక్షణమే అధికారులు మంచినీటి కష్టాలు తీర్చాలి


సామాజిక కార్యకర్త కర్నె రవి 


మణుగూరు : మండు వేసవిలో మండలంలోని సమితి సింగారం పంచాయతీలోని సాయి నగర్ వాసులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు

న్నారని,బిందెడు నీటి కోసం మహిళలు అష్టకష్టాలు పడుతు

సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటు

న్న అధికారులు మాత్రం చలనం కనిపించలేదని సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గత వారం రోజులుగా మిషన్ భగీరథ పథకం

 ద్వారా అందించే మంచినీటి

 సరఫరా నిలిచిపోయి సాయి నగర్ వాసులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న వారి నీటి కష్టాలను తీర్చడంలో అధికారుల పూర్తిగా వై పల్యం చెందారని విమర్శించారు. కనీసం సింగారం పంచాయతీ ప్రత్యేక అధికారి కానీ,మిషన్ భగీరథ అధికారులు కానీ,

మండల పంచాయతీ అధికారి కానీ ప్రజల మంచినీటి కష్టాలను పట్టించుకున్న పాపాన పాపాన పోలేదని అన్నారు.

ప్రత్యామ్నాయంగా మంచినీటిని ట్యాంకర్ల ద్వారా అందించడమే అధికారులు మర్చిపోయారని ఆరోపించారు. నీళ్ల కోసం పనులు మానుకొని రాత్రింబవళ్లు పడి

గాపులు కాయాల్సిన పరిస్థితి గ్రామంలో నెలకొన్నదన్నారు. దినంలో నల్లాలు ఎప్పుడొస్తాయో తెలియక రాత్రింబవళ్లు నీళ్ల కోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నా ప్రజలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఏ ఒక్క అధికారి కానీ సాయి నగర్ వాసుల నీటి గోస ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలోసతమాతమవుతున్నా, పంచాయతీ అధికారులు మాత్రం

తమకేమీ పట్టవు అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ను పట్టించు

కోవాల్సిన ప్రత్యేక అధికారికి ఫోన్ చేసినా కనీసం సందించడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు రవి తెలిపారు. గ్రామానికి పుష్కలంగా నీరు అందించే అవకాశం ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందిచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిచో ప్రజలతో కలసి పంచాయతీ కార్యాలయాన్ని

 ముట్టడించి అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Post a Comment

కొత్తది పాతది